ఐఫోన్.. ఆ ఫోనంటే ఇష్టపడని వారెవరు? ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది ఐఫోన్. అందుకే.. ధర ఎంతైనా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. యాపిల్ నుంచి ఈ ఏడాది ఐఫోన్ 7 విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
తాజాగా వాటర్‌ప్రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి అధునాతన సదుపాయాలతో ఐఫోన్ 7ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటర్ రెసిస్టెంట్ డిస్‌ప్లేతో పాటు.. వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా ఈ ఫోన్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో పాటు నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీని కూడా ఫోన్లతో ఇన్‌బిల్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment